Hospital Charges Rs 16 lakh for dengue treatment : Video

  • 7 years ago
In a shocking incident, a seven-year-old girl lost life of dengue in Gurugram's Fortis Hospital. The deceased parents alleged that the hospital overcharged and the hospital flouted the LAMA (Leave Against Medical Advice) rules.

గురుగ్రాంలోని ఓ ఆస్పత్రి అమానుషంగా ప్రవర్తించింది. డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాలిక చికిత్స పొందుతూ మరణించింది. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయినా.. ఆస్పత్రి యాజమాన్యం మాత్రం రెండు వారాల చికిత్సకు ఏకంగా రూ.16 లక్షల బిల్లు వేయడం శోచనీయం.
వివరాల్లోకి వెళితే.. ద్వారకకు చెందిన ఐటీ ఉద్యోగి జయంత్ సింగ్ డెంగ్యూతో బాధపడుతున్న తన ఏడేళ్ల కుమార్తె ఆద్యా సింగ్‌ను గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చేర్చారు. రెండు వారాల చికిత్స తర్వాత పరిస్థితి విషమించడంతో ఆద్య కన్నుమూసింది
కాగా, ఆ ఆస్పత్రి యాజమాన్యం.. 15 రోజులపాటు సదరు చిన్నారికి అందించిన వైద్య సేవలకు గాను ఏకంగా రూ. 15.79 లక్షల బిల్లును జయంత్ సింగ్ చేతికిచ్చింది. తమ పాప లేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆ తల్లిదండ్రులను ఈ చర్య విస్తుపోయేలా చేసింది. ఆసుపత్రి ఇచ్చిన బిల్లులో నర్సులు ఉపయోగించిన 2700 గ్లోవ్స్‌కు బిల్లు వేయడం గమనార్హం.