కోలీవుడ్ అరంగేట్రం చేస్తున్న మెగాడాటర్.. న్యూ లుక్ ఇదే..!

  • 7 years ago
The movie shooting is almost completed and they titled as 'Oru Nalla Naal Paathu Solren'. Recently Niharika's look in the movie got released. With her traditional attire, Niharika is looking extremely beautiful and is looking homely. With her jewellary, the actress is looking regal and elegant.

దాదాపుగా మెగా హీరోల వారసులు వచ్చినా హీరోలంతా ఒక ఎత్తయితే ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన నీహారిక ఎంట్రీ ఒకెత్తు. హీరోయిన్ గాచేసినా గ్లామర్ పాత్రలు చేసే అవకాశం వెబ్ సిరీస్‌లు, చిన్న తెర‌లో క‌నిపిస్తూ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక సంద‌డి చేస్తోంది. ఇటీవ‌ల‌నే తండ్రితో క‌లిసి ఓ వెబ్ సిరీస్ ప్రారంభించారు. దాని ప్రొమోకు విశేష స్పంద‌న వ‌స్తోంది.
తెలుగులో పెద్ద‌తెర అరంగేట్రం అచ్చి రాలేదు. ఒక మనసు చిత్రం అంద‌రికీ న‌చ్చినా పెద్ద‌గా ఆడ‌లేదు. దీంతో ఆ అమ్మ‌డు త‌మిళ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లింది. రెండో సినిమా కోసం ఆచితూచి అడుగులు వేసిన నిహారిక కోలీవుడ్‌కు వెళ్లింది. ఓ మంచి ఆఫర్ రావడంతో అటు వైపు వెళ్లింది. స్టార్ హీరో విజ‌య్ స‌ర‌స‌న న‌టిస్తోంది.
ఇప్పటికే చాలా భాగం ఆ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది'ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్' అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో.. స్టార్ హీరో విజయ్ సేతుపతితో పాటు.. కుర్ర హీరో గౌతమ్ కార్తీక్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నీహారిక న్యూ లుక్ తెగ హల్ చల్ చేసేస్తోంది.
సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్న నీహారిక స్టిల్ ఒక్కసారిగా షాక్ కొట్టించేసింది. ఒంటి నిండా ఆభరణాలు.. ధరించిన దుస్తులు అన్నీ పూర్తి స్థాయి రీగల్ లుక్ లోనే ఉన్నాయి.
ఇప్పటివరకూ ఈ సినిమా కంటెంట్ గురించి లీక్ కాకపోయినా.. నీహారిక లుక్ ను చూస్తే మాత్రం.. ఈ చిత్ర కథపై ఊహాగానాలు మొదలైపోయాయి. మరోవైపు.. కోలీవుడ్ అరంగేట్రంలోనే నీహారిక పై అంచనాలను పెంచేందుకు ఈ సాంప్రదాయ లుక్ బాగా ఉపయోగపడుతోంది.

Recommended