Outgoing DGP Anurag Sharma To Be Given Farewell By KCR

  • 6 years ago
Telangana govt arranged a farewell meeting to retired DGP Sri Anurag Sharma on Tuesday at Pragati Bhavan

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సేవలందించి ఇటీవలే పదవి విరమణ చేసిన అనురాగ్ శర్మను ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. మంగళవారం ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఘనమైన సన్మానం ద్వారా ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అనురాగ్ శర్మ సేవలను ప్రశంసించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుందన్న అపోహలను, దుష్ప్రచారాలను అనురాగ్ శర్మ పటాపంచలు చేశారని కొనియాడారు. రాష్ట్రాన్ని సహనశీలంగా మార్చిన ఘనత ఆయకే దక్కుతుందని పేర్కొన్నారు.
అనురాగ్ శర్మ పర్యవేక్షణలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ పోలీసింగ్ వ్యవస్థగా నిలిచిందన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దిన వ్యక్తి అనురాగ్ శర్మ అన్నారు. శాంతిభద్రతల నిర్వహణ నిరంతర ప్రక్రియ అని, తెలివి-సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు.
డీజీపీగా అనురాగ్ శర్మ అందించిన నాయకత్వం, సమన్వయం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. గత మూడున్నరేళ్లలో తెలంగాణ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలీసుల పనితీరును కూడా చూసి ఓటేయాలన్నామని గుర్తుచేశారు. చరిత్రలో ఇలాంటి సందర్భం లేదన్నారు