BJP leader beats 2 Dalits with stick : బురద నీటిలో మునగాలని

  • 6 years ago
A BJP leader behaved in a violent manner with two Dalit youths, who raised questions about his illegal gravel quarry in Abhangapatnam village of Navipet mandal in Nizamabad district.

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని అభంగపట్నంలో ఇద్దరు దళిత యువకులను అవమానించి, వారిపై దాడి చేసినందుకు గాను బీజేపీ నాయకుడు భరత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. దళిత యువకులు కొండ్ర లక్ష్మణ్, రాజేశ్వర్‌లపై భరత్ రెడ్డి దాడి చేశాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదయింది.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌ జిల్లా, నవీపేట మండలం అభంగపట్నం ఎర్రగుంట శివారులో బీజేపీ నేతతోపాటు మరోకతను మొరం క్వారీ నిర్వహిస్తున్నాడు. ఈ క్వారీ లో తవ్వకాలు చేపడుతుండటంతో అదే గ్రా మానికి చెందిన కొండ్ర లక్ష్మణ్‌, రాజేశ్వర్‌ అనే వ్యక్తులు క్వారీ వద్దకు వెళ్లి మొరం తవ్వకాల ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాగా, అక్రమంగా మట్టిని తరలించడాన్ని ఆ దళిత యువకులు ప్రశ్నించారని, దీంతో వారిపై భరత్ రెడ్డి ఆటవికంగా దాడి చేశాడని తెలుస్తోంది. కర్రతో బెదిరిస్తూ, వారిద్దరిని బురద ఉన్న చెరువులో మునగాలని హెచ్చరించాడు. చేత కర్రపట్టుకుని బడిపిల్లలను బాదినట్లు బాదడంతో పాటు రెండు చేతులు కట్టుకోవాలని, తప్పుచేశామని ఒప్పుకోవాలని బూతులు తిడుతూ వెంటపడ్డాడు. పక్కనే ఉన్న ఓ నీటిగుంటలోకి లక్ష్మణ్‌, రాజేశ్వర్‌లను వెళ్లి మునగాలంటూ ఆదేశాలిచ్చాడు.

Recommended