Boat Mishaps in AP : Many doubts raising

  • 6 years ago
Many doubts raising after boat tragedy in Krishna river, especially on officials monitoring

కృష్ణా నది ప్రమాద ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. గత ప్రమాదాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. బోటు విషాదాలపై ప్రభుత్వాలు ఇకనైనా మేల్కొనకపోతే.. భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్టే. సుదీర్ఘ నదీ తీరం కలిగిన జిల్లాలో పర్యాటక సంస్థ అభివృద్ది చెందడం మంచిదే అయినప్పటికీ.. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటం పర్యాటకుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా నదితో పాటు అంతర్వేది, యానాం నదిపై ఎన్నో బోట్లు తిరుగుతుంటాయి.గోదావరి నదిపై పాపికొండల ప్రాంతానికి పర్యాటకులను తీసుకెళ్లే బోట్లు కొన్నయితే.. మరికొన్ని ఉభయ గోదావరి జిల్లాల మధ్య ప్రయాణికులను తరలిస్తున్నాయి. అయితే వీటిల్లో చాలావరకు బోట్లు కనీస ప్రమాణాలను అటకెక్కిస్తుండటం ఆందోళన కలిగిస్తోన్న అంశం. జిల్లా అధికారులు కూడా వీటి నిర్వహణ పట్ల ఏమాత్రం దృష్టి సారించినట్టు కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడంతో ప్రైవేటు బోట్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.