హైపర్ ఆదిపై ఫైర్ అయిన మహేష్ కత్తి

  • 6 years ago
Tollywood Movie Critic Mahesh katti warned Hyper Aadi in Facebook live, About Jabardasth skit with aadi and team on mahesh katthi

జనాలు తిట్టుకుంటూ కూడా చూసే కామెడీ షో జబదస్థ్, ఈ మధ్యకాలంలో వచ్చిన రియాలిటీషోలన్నిటికీ ఇన్స్పిరేషన్ ఇదే అనటం లో సందేహం లేదు... అయితే ఈ షో మొదలైన దగ్గరినుంచీ రకరకాల వివాదాల్లో ఉన్న ఇంకా అదేరకంగా సాగుతూనేఉంది. ఆడవాళ్లని కించపరుస్తున్నారనే ఆరోపణలు మొదలు కులవివక్ష, కోర్టునే అపహాస్యం చేయటం లాంటి ఆరోపణలతో కేసులని కూడా ఎదుర్కుందీ షో...
ఈ షో లో హైపర్ ఆది చేసే స్కిట్ లకి కాస్త ఫాలోయింగ్ ఎక్కువే, దాదాపు వాట్సాప్, ఫేస్బుక్లలో వచ్చే జోకులనే కాపీకొట్టి "పంచ్" లుగా వాడే ఆదీ స్కిట్స్లో గతం లోనే రామ్‌గోపాల్ వర్మ మీద కూడా సెటైర్లు వేసాడు... రాత్రి బోరుకొడితే ఓడ్కా బాటిల్ ఓపెన్ చేసి ట్విట్టర్ ఓపెన్ చేస్తాడంటూ ఇన్‌డైరెక్ట్ గా రామ్‌గోపాల్ వర్మ మీద వేసిన సెటైర్లకే ఆది మీద కొంత వ్యతిరేకత వచ్చింది జనాల్లో.
మెగా ఫ్యామిలీకి ఎవరు ఆపోజిట్ లో ఉన్నా వాళ్ళే హైపర్ ఆది స్కిట్లో నెక్స్ట్ టార్గెట్. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీ దగ్గర్నుంచీ మహేష్ కత్తి ఎదుర్కుంటున్న సమస్యలు మనందరికీ తెలిసినవే అదే సమయం లో హైపర్ ఆది కూడా మహేష్ కత్తిని టార్గెట్ చేస్తూ ఒక స్కిట్ వేసాడు.

Recommended