Baahubali Actress Anushka Have A Crush On This Cricketer | Oneindia Telugu

  • 6 years ago
Anushka Shetty, who turned 36 continues to dominate the big screens. Anushka, who has played the role of Devasena in Baahubali 2 and caught everybody’s eye, finally revealed her favorite cricketer.
సినిమాకి, క్రికెట్‌కు ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది. క్రికెటర్లు, సినిమా రంగానికి చెందిన వారిని ప్రేమించడం, వారితో ప్రేమలో పడటం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడ్డానని టాలీవుడ్ హీరోయిన్ అనుష్క వెల్లడించింది.
ఓ టాలీవుడ్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో అనుష్క ఈ విషయాన్ని వెల్లడించింది. ఓ అభిమాని.. మీ అభిమాన క్రికెటర్‌ ఎవరు అని ప్రశ్నించగా, దీనికి అనుష్క ‘రాహుల్‌ ద్రవిడ్‌ నా అభిమాన క్రికెటర్‌. నా చిన్నతనం నుంచి అతనంటే నాకు పిచ్చి. ఎంతలా అంటే ఒకానొక సమయంలో ద్రవిడ్‌తో ప్రేమలో పడ్డా' అని చెప్పుకొచ్చింది.

Recommended