Himachal Pradesh Assembly Elections 2017 Updates | Oneindia Telugu
  • 6 years ago
The voting for Himachal Pradesh legislative elections has begun. The two main contenders of this year’s elections are Virbhadra Singh from Congress and Bharatiya Janata Party’s Prem Kumar Dhumal.
హిమాచల్ ప్రదేశ్‌లో గురువారం శాసనసభ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. అన్నిచోట్లా బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బరిలో 62 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌, 10 మంది మంత్రులు, 8 మంది ముఖ్య పార్లమెంటరీ కార్యదర్శులు, మాజీ సీఎం ప్రేంకుమార్‌ ధుమాల్‌ సహా పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
68 నియోజకవర్గాలు ఉన్నాయి. 338 మంది బరిలో ఉండగా, అందులో 19 మంది మహిళలు. 25,68,761 మంది పురుష ఓటర్లు, 24,57,166 మంది మహిళా ఓటర్లు, 14 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఝాందూత నియోజకవర్గంలో ముఖాముఖి పోరు సాగుతుండగా ధర్మశాలలో అత్యధికంగా 12 మంది పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థులైన వీరభద్రసింగ్‌, ధుమాల్‌ కూడా ఈసారి తమ నియోజకవర్గాలను మార్చుకున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు రసీదు యంత్రాలను (వీవీప్యాట్‌లను) వాడనున్నారు.
ఇక 1985 నుంచి కాంగ్రెస్‌, బీజేపీ ఒకదాని తర్వాత ఒకటి చొప్పున హిమాచల్‌లో అధికారంలోకి వస్తున్నాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం చూసినా గెలుపు తమదేనని బీజేపీ భావిస్తోంది.
Recommended