IT raids on Jaya TV just After 3 days of Modi-Karunanidhi meet
  • 6 years ago
The Income Tax department is conducting raids at the premises of the Jaya TV in Chennai in connection with a case of alleged tax violation. Speculations raising over latest IT raids on Jaya tv and Sasikala's supporters, After three days of Prime Minister Modi visiting DMK's chief Karunanidhi residence, it's just appearing like strategical
ప్రధాని నరేంద్ర మోడీ, డీఎంకె చీఫ్‌ కరుణానిధితో భేటీ అయిన మూడు రోజుల వ్యవధిలోనే చెన్నైలోని జయ టీవిపై ఐటీ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఐటీ దాడులు కాకతాళీయమే అనుకున్నప్పటికీ.. దీనికి మూడు రోజుల ముందు జరిగిన మోడీ పర్యటనను కూడా ముడిపెట్టి చూస్తున్న పరిస్థితి. తమిళనాడులో బలంగా ఉన్న అన్నాడీఎంకెను దెబ్బతీయడానికి అటు కేంద్రం, ఇటు డీఎంకె ఏమైనా చేతులు కలుపుతున్నాయా? అన్న అనుమానాలకు కూడా ఈ పరిణామాలు తావిస్తున్నాయి.
10మంది సభ్యులతో కూడిన బృందం జయ టీవి కార్యాలయంలో ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. జయ టీవి డైరెక్టర్ వివేక్ ఇంటిపై కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇకట్టుతుంగలో ఉన్న జయ టీవి కార్యాలయం ప్రస్తుతం శశికళ-దినకరన్ ఆధీనంలో ఉంది.జయ టీవితో పాటు బెంగళూరులోని పుహాలెందిలో ఉన్న శశికళ సన్నిహితుల ఇంటిపై కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, అన్నాడీఎంకె పార్టీకి జయ టీవి అధికారిక మీడియా ఛానెల్ అన్న సంగతి తెలిసిందే
Recommended