Ryan School Pradyumn’s Case : Too Many Questions Remain Unanswered

  • 6 years ago
The charges came hours after the Central Bureau of Investigation (CBI) detained a Class 11 student of the same school and said the older boy committed the harm to get examinations and a parent-teacher meeting postponed.
ప్టెంబర్ 8న గురుగ్రామ్‌లోని రియాన్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రెండో తరగతి విద్యార్థి ప్రద్యుమన్‌ హత్యకు గురవడం ఢిల్లీ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ప్రద్యుమన్‌ హత్యకు సంబంధించి తొలుత స్కూల్ బస్ కండక్టర్ పై ఆరోపణలు వచ్చాయి.
తాను అసహజ శృంగారానికి పాల్పడుతున్న సమయంలో చూసినందువల్లే ప్రద్యుమన్‌ను కండక్టర్ హత్య చేసి ఉంటాడని ప్రచారం జరిగింది. కానీ తాజా సీబీఐ దర్యాప్తులో నివ్వెరపోయే విషయాలు వెల్లడయ్యాయి. 11వ తరగతి చదువుతున్న విద్యార్థే ప్రద్యుమన్‌ను హత్య చేసినట్టు నిర్దారించారు.
స్కూల్ బస్ కండక్టరుపై ఆరోపణలు రావడంతో పోలీసులు తొలుత అతన్ని విచారించారు. కానీ అతని నుంచి ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. స్కూలు ఆవరణలోని సీసీ టీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలించారు.ప్రద్యుమన్‌ హత్యకు ముందు ఆ బాత్‌రూమ్‌ వద్ద అనుమానాస్పదంగా తిరిగినవారిని గుర్తించారు. టీచర్లను, విద్యార్థులను, సిబ్బందిని కూడా విచారించారు. చివరకు 11వ తరగతి విద్యార్థే ప్రద్యుమన్‌ను హత్య చేశాడని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్‌ దయాళ్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు.