పనిలేక పోస్ట్‌లు పెడుతున్నావ్ అంటూ...వర్మ కూతురు ఫైర్..

  • 7 years ago
"Revathy Varma who is more Pawan Kalyan Fan and less my daughter reacted like this on the post of my comment on his sons name Mark Shanker Pawanowich" Posted Varma on his Face Book wall.
పవన్ కళ్యాణ్ కొడుకు పేరు మీద వర్మ స్పందించిన తీరు ఇప్పుడు వర్మ కూతురితో గొడవకి కారణమైంది. ఇద్దరి మధ్యా మెసేజ్ లయుద్దం జరిగింది. అసలు నీకేం పనిలేక ఇలాంటి పోస్టులు పెడుతున్నావ్ అంటూ తండ్రినే నిలదీసింది రేవతి. పవన్ అటు రష్యన్, ఇటు ఇండియన్ సాంప్రాదాల కలయికగా "మార్క్ శంకర్ పవనోవిచ్" అనే పేరు పెట్టాడు. చిరంజీవి అసలు పేరైన శివశంకర వరప్రసాద్ లోని శంకర్ నీ, తనపేరులోని పవన్ నీ కలిపి పవన్ పెట్టుకున్న పేరు రామ్‌గోపాల్ వర్మకి మాత్రం వెటకారంగా కనిపించిందట.
ఈ ప్రపంచంలో క్రైస్తవం పుట్టక ముందు నుంచి, అసలు మానవులు మాట్లాడుకోగలరా? అని ఈజిప్టుకు చెందిన పారా సమెథికస్-1 పరిశోధనలు చేసిన కాలం నుంచి వెతికినా, ఇప్పటివరకూ వినని పేరును తానిప్పుడు విన్నానని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు.
ఈ పేరు అతి గొప్పదని వర్మ తన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టాడు. భాషలు పుట్టిన తరువాత తాను విన్న పేర్లలో అత్యంత గొప్పది ఇదేనని చెప్పాడు. ఇలా పవన్ కళ్యాణ్‌నే కాదు ఇక పవనోవిచ్ మీద కూడా యుద్దం మొదలు పెట్టాడు వర్మ...

Recommended