Hariteja Shared About Her Entry In Tollywood ఎవరీ అమ్మాయి అని ఆరాలు తీశారు..

  • 7 years ago
బిగ్‌బాస్ ఫేమ్ హరితేజ సెలబ్రిటీ స్టేటస్ కి ఉక్కిరిబిక్కిరి అయిపోతోందిప్పుడు. బిగ్ బాస్ కి ముందు అంతంత మాత్రంగానే తెలిసిన హరి తేజ ఆ షో తర్వాత మాత్రం తన టాలెంట్ తో చాలామందినే ఆకట్టుకుంది. అయితే ఈ మధ్య పాల్గొన్న ఒక రియాలిటీ షో లో అసలు హరి తేజ సినిమా ఇండస్ట్రీకి ఎలా ఎంటర్ అవ్వాల్సి వచ్చిందనే విషయం కదిపాడు షో హోస్ట్ అయిన కమేడియన్ అలి. దాంతో అసలు తానే మవ్వాలనుకుందో, కానీ అనుకోకుండానే కొత్త కెరీర్ లోకి ఎలా వచ్చేసిందో చెప్పింది హరి తేజ...
''హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఓ క్లాసికల్ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నన్ను, ఆ కార్యక్రమం అనంతరం కొందరు ఫోటోలు తీశారు. అవే ఫోటోలు సినిమా ఆఫీసులకు వెళ్లిపోయాయ్. అదే టైమ్‌లో ఏదో సీరియల్ స్టార్ట్ అవుతోంది. కొత్తమ్మాయ్ కావాలి. తెలుగు అమ్మాయి కావాలని చూస్తున్న వారికి, నా ఫొటో నచ్చి.. ఎవరీ అమ్మాయి అని ఆరాలు తీశారు. అప్పుడు నేను టెన్త్ చదువుతున్నాను. ఒక్కసారి కాల్ చేసి పిలిపించమని చెప్పడంతో వారు నన్ను పిలిపించారు. అప్పుడు స్క్రీన్ మీద నాకేం తెలియవు. డ్యాన్స్‌పై ఎక్కువ శ్రద్ధ ఉండేది. మంచి డ్యాన్సర్‌ని కావాలనే కోరిక ఉండేది. కానీ ఇలా యాక్టర్‌ని చేసేశారు..'' అంటూ ఆలీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది హరితేజ.

Recommended