Ravi Shastri's new Training style Immediate impact on Team India

  • 7 years ago
Colombo, July 31: After taking charge of the team in his second stint, India coach Ravi Shastri has tweaked team's preparation style and though it's early days, an immediate impact can be noticed.
రెండోసారి కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి కోహ్లీ సేన తీరుతెన్నులను మార్చేశాడు. తనదైన శైలిలో జట్టుకు కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అతడి స్టయిల్‌ మైదానంలో మంచి ఫలితాలు చూపుతుండడం విశేషం. రవిశాస్త్రి కోచింగ్ స్టయిల్ ఎలా ఉంటుందంటే.. ఓపెనర్లు జట్టుకంటే ముందే గ్రౌండ్‌కు చేరుకొని ప్రాక్టీస్ చేస్తారు. ఇందులో భాగంగానే గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో ధావన్, అభినవ్ ముకుంద్ అందరికంటే ముందుగా స్టేడియానికి వచ్చి ప్రాక్టీస్‌ చేశారు. జట్టు కనుక తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే ఓపెనర్లు అప్పటికే నెట్స్‌లో బాగా ప్రాక్టీస్‌ చేసి ఉండాలన్నది శాస్త్రి ఉద్దేశం. ఇందులో భాగంగానే తొలుత ఓపెనర్లు నెట్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. గాలే టెస్టులో కోహ్లీ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో అప్పటికే ప్రాక్టీస్ చేసిన ధావన్‌.. మొదటి ఇన్నింగ్స్‌లో చెలరేగి ఆడి 168 బంతుల్లోనే 190 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Recommended